విభజన రాజకీయాలే మణిపూర్‌ హింసకు కారణం…

– సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కావాలి
– అస్తిత్వం కోసం అక్కడి ఆదివాసీల ఆందోళన :ఎస్వీకే వెబినార్‌లో ప్రొఫెసర్‌ రామ్‌దాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌ హింసకు శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాల యం రాజనీతిశాస్త్రం విభాగం ప్రొఫెసర్‌ రామ్‌దాస్‌ సూచించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయ కుమార్‌ సమన్వయంలో ‘మణిపూర్‌ హింసాకాండ – దాని మూలాలు’ అనే అంశంపై వెబినార్‌ను నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ రామ్‌దాస్‌ మాట్లాడుతూ 2017 నుంచి రాష్ట్రంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వివిధతెగల మధ్య ఘర్షణలు రేపుతు న్నాయని తెలిపారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ నుంచి వలసలెక్కువవుతున్నాయంటూ రెచ్చగొట్టా యని తెలిపారు. దీంతో బీజేపీ ప్రభుత్వం తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తోందని ఆదివాసీలు భావించడంతో, మైదాన ప్రాంతం వర్సెస్‌ కొండ ప్రాంతాలుగా పరిస్థితి మారిందని చెప్పారు. హిందూ జాతీయవాదంతో అఖండ భారత్‌ కోసం పని చేస్తున్న బీజేపీ సంస్కృతీకరణ విధానాలతో తమ అస్తిత్వం దెబ్బతింటుందని ఆదివాసీలు ఆందోళన చెందు తున్నారని వివరించారు. దీనికి తోడు విభజన రాజకీ యాలతో క్రైస్తవులు, క్రైస్తవేతరుల మధ్య ఘర్షణలకు నెట్టిందనే ఆజ్యం పోశారని ఆవేదన వ్యక్తం చేశారు. అస్సోంలో మాదిరిగా మెజార్టీలను మైనార్టీలపైకి ఉసిగొల్పి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని తెలిపారు. మొహతీ తెగ వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయంతో ఇది తారాస్థాయికి చేరిందని తెలిపారు. 1947లోనే తమ అస్తిత్వం, ప్రత్యేక సంస్కృతిని హిందూ జాతీయవాదం గుర్తించడం లేదని అసంతృప్తి చెందిన అక్కడి ఆదివాసీలు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లను వినిపించారని గుర్తుచేశారు. వలసపాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నామని భావిస్తున్న వారికి స్వయంపాలన అధికారాలివ్వడమే మంచిదని సూచించారు. అలా కాదని… దాన్ని శాంతి భద్రతల కోణంలో చూస్తే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని తెలిపారు. క్రైస్తవులైన ఆదివాసీల్లో 95 శాతం మంది విద్యావంతులై ఉద్యోగాలు పొంది చైతన్యవంతులు కావడం కూడా తమ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించగలిగేలా చేసిందని తెలిపారు.
వైదిక మతం….దానితో పాటే అంటరానితనం
ఏడేండ్ల క్రితం మణిపూర్‌ను సందర్శిం చినప్పుడు అక్కడి వారిలో వైదికమతం తమ ఆదివాసీ సంస్కృతిని వెనక్కి నెట్టిం దనే భావన వ్యక్తమైందని ఎస్‌.వినయ కుమార్‌ తెలిపారు. వైదిక సంస్కతికి ఉన్న ప్రోత్సాహం గిరిజన సంస్కృతికి ఇవ్వడం లేదని చెప్పారు.
గిరిజన కార్యక్రమాలంటూ నిర్వహించే వాటిలోనూ వైదిక అంశాలను జోడిస్తున్నారని వివరించారు. దేశవ్యాప్త సంస్కృతీకరణ విధానంలో భాగంగా మణిపూర్‌లో ఇప్పుడు హింస కొనసాగు తోందని వివరించారు. అక్కడి గుడిని సందర్శించిన తర్వాత వైష్ణవ సంప్రదాయం ప్రకారం భోజనం ప్రకారం… పెట్టారని తెలిపారు.
వడ్డించే వారు… నుంచి అన్నం జార విడిచినట్టుగా వేశారనీ, ఒకవేళ కూర్చున్న తాము తాకితే అన్నమంతా మైలపడిపోతుందన్నట్టు వ్యవహరించారన్నారు. శతాబ్దాల ఆదివాసీ సంస్కృతి కనుమరుగు కావడం, వైదిక మతం విస్తరించడం, దానితో పాటు అంటరానితనాన్ని సైతం ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారని వివరించారు.

 

Spread the love