నవతెలంగాణ- హైదరాబాద్
ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్ సీ కొనుగోలుదారులను ఆకర్షించడానికి దీపావళి పండుగ సందర్బంగా డబుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. ఈ సీజన్‌లో నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సీ సీఎండీ యం బాలు చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతీ మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు విలువ చేసే మొబైల్ ప్రొటెక్షన్ ఉచితంగా పొందవచ్చన్నారు. రూ12వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్, అదే విధంగా రూ.5,999 విలువ గల ఖచ్చితమైన బహుమతిని కూడా అందిస్తున్నామన్నారు. ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్ కొనుగోలు చేసే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. వివో, ఒప్పో, ఎంఐ, రియల్‌మీ మొబైల్ కొనుగోళ్లపై లక్కీ డ్రాలో కార్లు, బైకులు, మొబైల్స్ తదితర బహుమతులను గెలుచుకోవచ్చన్నారు. బ్రాండెడ్ పరికరాలపై 51 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నామన్నారు. ఎటిఎం కార్డుపై ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండానే మొబైల్, స్మార్ట్ టీవీ, ల్యాప్‌టాప్, ఎయిర్ కండీషనర్‌లను కొనుగోలు చేయవచ్చన్నారు.