– మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగుల నిరీక్షణ
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని యువతరాన్ని చూడగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భాంజీ (మేనకోడలు) లేదా భాంజా (మేనల్లుడు) అని సంబోధిస్తారు. తను మామ (మావయ్య) వలె.. ప్రవర్తిస్తుంటారు.” మీకు అండగా ఉంటా.. ఉద్యోగాలిస్తానంటూ హామిలిచ్చారు” కానీ ఆ హామీలు నీటమూటలయ్యాయి. అయితే మరోపక్క ఈ నిరుద్యోగ యువతే మాకు ఉద్యోగం వచ్చినపుడే మాకు దీపావళి అని అంటున్నారు. మార్చిలో అసెంబ్లీ జరిగినపుడు బీజేపీ ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసుకున్న 39 లక్షల మంది నిరుద్యోగ యువకులలో, గత మూడేండ్లలో కేవలం 21 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అదనంగా, అనేక రిక్రూట్‌మెంట్ పరీక్షలకు మాల్‌ప్రాక్టీస్ ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి . వీటికి తోడు అనేక ఇతర పరీక్షల ఫలితాలు ఆలస్యమయ్యాయి.