గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ నేతల కీలక భేటీ.. హజరుకానున్న డికె శివకుమార్

నవతెలంగాణ హైదరాబాద్: సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ ముఖ్య నేతలు గాంధీభవన్‌లో సమావేశం కానున్నారు. విజయభేరి బస్సు యాత్రపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌, కర్ణాటక డిప్యూటీ సీంఎ డీకే శివకుమార్‌, కర్ణాటక మంత్రి బోస్‌ రాజు హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. శనివారం వికారాబాద్‌ నుంచి చేవెళ్ల వరకు జరగనున్న ఎన్నికల ప్రచారంలో  డీకే శివకుమార్‌ పాల్గొననున్నారు.

Spread the love