నవతెలంగాణ – వాంకిడి
మండల కేంద్రంలో బుధవారం డీఎల్పీఓ సురేష్‌బాబు సానిటేషన్‌లో భాగంగా వీధివీధి తిరుగుతూ సానిటేషన్ పనులను పరిశీలించారు. మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రతపై ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్‌లకు, కార్యదర్శులకు సూచించారు. ఆయనతో పాటు సర్పంచ్ తుకారాం, ఎంపీఓ శివకుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.