పంచాయితీ కార్యదర్శులతో డీఎల్ పీఓ సమావేశం

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎల్లారెడ్డి డీఎల్ పీఓ సురేందర్ మండల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ పథకానికి సంబంధించిన అప్లికేషన్లను అయన పరిశీలించారు. మండల వ్యాప్తంగా 421 అప్లికేషన్లు రావడం జరిగిందని వాటికి సంబంధించి పలు విషయాలను పంచాయతీ కార్యదర్శులకు ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్ ఉన్నారు.
Spread the love