పీహెచ్సీలను తనిఖీ  చేసిన డిఎంహెచ్ఓ..

DMHO inspected PHCs..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

యాదాద్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ ఆకస్మికంగా  బోల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోగల అనాజిపురం పల్లె దవాఖానను సందర్శించారు. ఈ సందర్శనలో పల్లె దవఖాన లో అందిస్తున్నటువంటి 12 రకాల ఆరోగ్య పరీక్షలు వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరము లైఫ్ స్టైల్ డిసీస్ అయినటువంటి బీపీ షుగర్ రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె దవాఖానాలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేలా విధులు నిర్వర్తించాలని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ విజయ ను కోరారు .ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love