– డేంజర్ జోన్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
– స్వగ్రామంలోనే యువతకు ఉపాధి కల్పిస్తా
– రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీదర్ బాబు
నవతెలంగాణ:మల్హర్ రావు:-
ఏబిసిడిలకు అర్థం తెలియని వారి మాటలు నమ్మవద్దని, తాడిచెర్ల ఓసిపి డేంజర్ జోన్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు.బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో గ్రామదేవతల మారుకొలుపు ఉత్సవాలలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు కొయ్యూర్ గ్రామంలోని నాగులమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని దేవతలను వేడుకున్నట్లు తెలిపారు. తాడిచర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు.తాడిచర్ల ఓపెన్ కాస్ట్ డేంజర్ జోన్ కు సంబంధించి ల్యాండ్ అక్వేషన్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలని బట్టి విక్రమార్కను కోరామన్నారు.ఈ సందర్భంలో ప్రణాళిక బద్ధంగా ముందుకుపోయి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేసే దిశగా సానుకూలంగా ముందుకు పోతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మార్పును చూపిస్తుందన్నారు. తాడిచర్ల గ్రామంలో మంచినీటి సమస్య ఏర్పడితే వెంటనే బోర్లను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు.గ్రామాన్ని సుందరీకరణ చేపట్టే బాధ్యత మాదని,ఎంపీడీవో ఆఫీసు మొదలుకొని మానేరు ఖమ్మంపల్లి వంతెన వరకు సుందరీకరణ పనులను చేపడతామని,రహదారులను వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తామన్నారు.ఇందుకు నిధులు రాగానే విడుదల చేసి మల్లారం,తాడిచర్ల గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు.యువతకు స్వగ్రామాల్లోనే స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్లతో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా చర్చిస్తున్నారు.ఏబిసిడిలు తెలివని వారు కూడా దుష్ప్రచారాలను నమ్మద్దన్నారు.అందరం కలిసి ప్రణాళిక బద్ధంగా ముందుకుపోయి మండలాన్ని ,తాడిచర్ల, మల్లారం గ్రామాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ను అభివృద్ధి చేసుకుందామన్నారు. నాకు మీరిచ్చిన బాధ్యతతో మేలు చేసే కార్యక్రమాలు చేస్తా, నా శక్తి మేరకు,నా పరిధిలో మేరకు పనులు చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు