పదోన్నతుల్లో అడెక్వసీని అమలు చేయొద్దు

– టీయూఎస్‌జేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదోన్నతుల్లో అడెక్వసీ జీవోనెంబర్‌ రెండును అమలు చేయొద్దని టీయూఎస్‌జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో ఆ జేఏసీ నాయకులు కె చైతన్య, టి సత్యనారాయణ, ప్రభాకర్‌, శ్రీనివాసులు, నరసింహం కలిసి వినతిపత్రం సమర్పించారు. ముందుగానే క్యాడర్‌ స్ట్రెంథ్‌ను ప్రకటించాలనీ, రోస్టర్‌ కం మెరిట్‌ జాబితాను ముందే విడుదల చేయాలని కోరారు. డీఎడ్‌తో ఎస్జీటీలుగా నియామకమైన వారికే ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతులను ఇవ్వాలని సూచించారు. అడెక్వసీని అమలు చేయబోమంటూ మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు.

Spread the love