కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయరా?

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, అధికారులకు నోటీసులు
వతెలంగాణ-హైదరాబాద్‌
తమ ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని జీహెచ్‌ఎంసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. జులై 11న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, డిప్యూటీ కమిషనర్‌ రవితేజ, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్‌ రాజ్‌కుమార్‌లకు ఫారమ్‌-1 నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ఏ విధమైన చర్యలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించినా జీహెచ్‌ఎంసీ అధికారులు తమ డెక్కన్‌ కిచెన్‌ను కూల్చివేశారంటూ జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌లో డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ కోర్టుధిక్కార పిటిషన్‌ దాఖలు చేసింది.

Spread the love