రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఆటంకం కలిగించవద్దు..

– హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్
– రాజ్యాంగం న్యాయ వ్యవస్థ పై సెమినార్
– ఐలు మహాసభలు విజయవంతం….
నవతెలంగాణ – భువనగిరి రూరల్
రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఆటంకం కలిగించకుండా పరిపాలన కొనసాగించాలని ప్రతి ఒక్కరూ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఆటంకం కలిగించ వద్దని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ ఉద్ఘాటించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆదివారం రెండవ రోజు లో రాజ్యాంగం న్యాయవ్యవస్థ అనే అంశంపై సెమినార్లు ఆయన పాల్గొని మాట్లాడారు.రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు ఆటగా కలిగించే విధంగా అధికార పక్షాలు వివరించినప్పుడు వారి యొక్క అధికారం పరిధిని రాజ్యాంగం లోబడి రాజ్యాంగం మౌలిక సూత్రాలు కట్టుబడి ఉండాలని చెప్పిన విస్తృత ధర్మాసను వెలువర్చిన తీర్పును కేశవానంద భారతి కేసులో అంశాలను ప్రత్యేకంగా గుర్తించడం జరిగిందని ఆయన అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కలిగించినప్పుడు పౌరుల హక్కులను కాల రాసినప్పుడు న్యాయ వ్యవస్థ వ్యవహరించిన తీరు అభినందనీయమన్నారు. వాటిని పౌరుల హక్కులు కాపాడుకోవడం అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వాలు తమ వ్యక్తిగత ఎజెండాలకు జెండాల వలన కాల రాసినప్పుడు ఆ హక్కులు కాపాడే బాధ్యతని తీసుకోవాలని కోరారు. పౌరుల యొక్క హక్కులను రక్షించే విషయంలో న్యాయవాదులు పాత్ర చాలా ప్రముఖమైన పాత్ర వహించాలని కోరారు. ఐలు ఇలాంటి సంస్థలు ముందుకు ఇందులో ఉంటుందని ప్రత్యేకంగా తెలియజేశారు. తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా కట్టుబడి ఉన్నానని తెలిపారు. సత్సంబంధాలను కలిగి ఉన్నారని తన కార్యనిర్వహణలో ఐలు తోడ్పాటు ఎల్లప్పుడూ తనతో ఉంటుందని  వివరించారు. భవిష్యత్తులో ఐలు తీసుకునే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఆయన తెలియజేశారు. న్యాయవాదన్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి న్యాయవాది చట్టాలపై అవగాహన నిప్పులతో కలిగి ఉండాలని భవిష్యత్తులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐలు ఆల్ ఇండియా కార్యదర్శి సురేంద్రనాథ్ మహాసభలకు అధ్యక్షవర్గంగా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ అనంతల శంకరయ్య శైలజ ,ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎండి నాగర్ ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు కొత్త బుచ్చిరెడ్డి, అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి ఎం డి. ఇస్మాయిల్ జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డి, నర్సింగ్ యాదవ్, కేశవరెడ్డి,  కుక్క దూగ సోమయ్య, బాబురావు, చింతల రాజశేఖర్, రెడ్డి, బొలెపెల్లి కుమార్, తడక మోహన్, కొడుకు కిషన్, ఎండీ నేహాల్, యాదాసు యాదయ్య, జండా రమేష్, ఖయ్యూం శంకర్ ఐలయ్య పాల్గొన్నారు.
పలు అంశాలపై తీర్మానం
మహాసభల సందర్భంగా న్యాయవిజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని మృతి చెందిన న్యాయవాదికి ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఉచితంగా లేదా కనీస ధరకు ఇవ్వాలన్నారు. న్యాయవాదులకు జీవిత భీమ ,ఆరోగ్య కార్డులు జారీ చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కోర్టులలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. కోర్టు భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలన్నారు. న్యాయాధికారుల న్యాయశాఖ ఉద్యోగాలను వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని తీర్మానించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ న్యాయవాదులకు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, బ్యాంకు, జీవిత బీమా కంపెనీల స్టాండింగ్ కౌన్సిల్ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఏజెన్సీ కోర్టులలో ఆ చట్టాలకు అనుగుణంగా పనిచేసేలా రెగ్యులర్ న్యాయాధికారుల నియమించాలని పలు తీర్మానాలు చేయగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. న్యాయవాదులు పలువురు పాటలు పాడుతూ సభికలను అలరించారు. రెండు రోజులుగా నవ తెలంగాణ బుక్ హౌస్ ఏర్పాటుచేసిన పుస్తకాల అమ్మకాలు కొనుగోలు పెద్ద ఎత్తున జరిగాయి. అఖిలభారత న్యాయవాదుల సంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఏర్పాట్లు పట్ల ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా మహాసభలకు 400 మంది ప్రతినిధులు హాజరై సభను విజయవంతం చేశారు. మహాసభకు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రతినిధులకు ఆహ్వాన సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, ఐలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడి వెంక రెడ్డి, ఎం డి స్మైల్ అభినందనలు తెలిపారు.

Spread the love