నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలంలోని గోలీ లింగాల గ్రామంలో ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని ఇటీవలే ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై శుక్రవారం రోజు మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ విచారణ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి వారి అభిప్రాయాలను స్వీకరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో ఇప్పటి వరకే జియో టవర్ ఉందని తద్వారా రేడియేషన్ ఉత్పత్తి కావడం జరుగుతుందని గ్రామంలో పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులకు గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. తమ ప్రక్క గ్రామమైన మాల్ తుమ్మెద గ్రామం నుండి తమ గ్రామానికి ఎయిర్టెల్ సిగ్నల్ రావడం జరుగుతుందని గ్రామంలో ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేయకూడదని వారు పేర్కొన్నారు. విచారణ నిర్వహించిన మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ ఉన్నత అధికారులకు నివేదిక పంపనట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు గంగాధర్ .మల్లికార్జున్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.