నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పలు గ్రామాల్లోని కిరాణ,ఇతర వ్యాపారులు పది రూపాయలు కైన్ తీసుకోవడం లేదు.ఆర్బీఐ మాత్రం కైన్ ను రద్దు చేసినట్లుగా ఎక్కడ ప్రకటించలేదు. నిరక్షరాస్యులే కాకుండా అక్షరాస్యులు సైతం తీసుకోకపోవడం లేదు వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవలే రూ.10 నోట్టు మార్కెట్ ఎక్కువగా చలామణి కాకపోవడంతోనే రూ.10 కైన్ తీసుకోవడం లేదా, లేక చెల్లు బాటు లో లెవా అనే సందేహాలు వెలువడుతున్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం కైన్ చెల్లుబాటులోనే ఉన్నాయని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వ్యాపారులకు, ప్రజలు అవగాహన కల్పించాలని కోరుతున్నారు.