చూసిందల్లా కొంటున్నారా..?

మనలో చాలామందికి చూసిందల్లా కొనేయటం అలవాటు. నగలు, చీరలు, మేకప్‌ సామాన్లు ఇలా ప్రతీది కొనాలనిపిస్తుంది. డబ్బు పొదుపు చేయటం అంటే సంపాదించినట్టే అంటారు కదా! అందుకే ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.
మంచి అనుభవాలతో.. వస్తువులు పోగుచేసుకోవటం కన్నా జ్ఞాపకాలు, అనుభవాలను పోగుచేసుకోవటం ఉత్తమం. కంటికి కనిపించినవన్నీ కొనేస్తుంటే డబ్బు వృథాతోపాటు చెత్తలా పేరుకుపోతాయి. కొన్ని వస్తువులు తాత్కాలికంగా ఆనందం ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఉపయోగం లేదు.
మనకు నిజంగా ఏది అవసరం, ఏది కాదు అనే పూర్తి అవగాహన ఉన్నప్పుడే జీవితంలో విజయవంతమవుతామట. చెప్పులు, దుస్తులు ఇలా ఏ వస్తువైనా సరే అవసరం ఉన్న మేర, అన్ని కాలాలకు నప్పేవి కొనుక్కుంటే ఉపయోగం ఉంటుంది.
ముందుగా మనకు అవసరం లేవనుకున్న వాటిని తొలగించండి. ఇల్లు ఎంత శుభ్రంగా, ఎంత తక్కువ సామానుతో ఉంటే అంత అందం. మనకు అవసరం లేని వాటిని అవసరమైన వాళ్లకు ఇవ్వాలి. ఎక్కడ ఖర్చు పెడతున్నామనే అంచనా మనకు పూర్తిగా ఉండాలి. పెట్టుబడులపై దృష్టి పెట్టాలి. ప

Spread the love