నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ప్రజలపై వీధి కుక్కల దాడులు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారించారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 040-21111111, 040-23225397కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది. డాగ్ క్యాచింగ్ టీంలు నేరుగా వచ్చి వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తాయని పేర్కొంది.