పిల్లల్ని దగ్గరుండి చదివిస్తున్నారా..?

Are you reading the children closely..?మీరా తన పిల్లలు సరిగా చదవడంలేదని కోపగించుకోవడం తరచూ గమనిస్తున్నాను. అదే అడిగాను. ఏం చేయను, ఇద్దరం ఆఫీస్‌లకు వెళ్ళి పోతున్నాం. వచ్చేసరికి ఆలస్యమవుతోంది. వీళ్లేమో స్కూలుకి వెళతారు గాని ఇంటిదగ్గర అస్సలు చదవడం లేదు. టీచర్లు టెస్ట్‌ పెడితే మార్కులు సరిగా రావడంలేదని కంప్లయింట్లు.. ఇలా చాలా చెప్పింది. నిజమే.. చదువు విషయంలో కాస్తంత జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టించుకోకుంటే చదువుకే దూరమైపోతారు.
ఏదో విధంగా వారంలో కనీసం రెండు మూడు రోజులు వాళ్ల చదువు విషయం పట్టించుకోమని అన్నాను. అందుకు నా పద్ధతులు పాటించమన్నాను. మొదట్లో కాస్తంత ఇబ్బంది పడినా, ఆఫీస్‌లో పనిభారం పెరిగినా, పిల్లల విషయంలో క్రమంగా సమయం కేటాయించడం జరుగుతోంది. ఆమె పిల్లలూ మంచి ఫలితాలు సాధిస్తారనే ఆశిస్తాను. దగ్గరుండి చదివించడం, కాస్తంత సీరియస్‌గా పట్టించుకోవడం ఎంతైనా మంచిది. పిల్లల్లోనూ చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా, ఇంటి పనుల్లో చాలా బిజీగా ఉండవచ్చు. కానీ మీ పిల్లల చదువు విషయం పైన దష్టి పెడుతున్నారా? అంటే, వాళ్లు స్కూల్లో, ఇంటి దగ్గరా సరిగా చదువుతున్నారో లేదో తెలుసుకుంటున్నారా? ఇది అత్యంత అవసరం. పిల్లల్ని పుస్తకాలకి, స్కూలుకి వదిలేయడం సరికాదు. రోజూ ఇంటిదగ్గర ఏమాత్రం శ్రద్ధగా చదువుతున్నారు, క్లాసులో బాగా రాణిస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడం, గ్రహించడం ఎంతో అవసరం, బాధ్యతగా భావించాలి. కేవలం స్కూలుకు, ట్యూషన్లకు పంపడంతో బాగా చదవడం, మంచి మార్కులు వచ్చేయడం జరగదు. మీకూ శ్రద్ధ వుండాలి.
దృష్టి పెట్టండి..
– పిల్లలు కేవలం క్లాస్‌ టెస్ట్‌ల సమయంలోనే కాకుండా రోజూ ఏకాగ్రతతో చదువుతున్నదీ లేనిదీ దష్టిపెట్టండి.
– వాళ్లకి చదువుకునే వాతావరణం కల్పించాలి.
– టీవీలు, రేడియోలకు దూరంగా నిశ్శబ్ధ వాతావరణం ఉండేలా చూడాలి.
– వీలైతే పెద్దలూ ఆ సమయంలో టీవీ చూడడం తగ్గించాలి.
– సైన్స్‌, మాథ్స్‌ దగ్గరుండి బోధించే ప్రయత్నం చేయాలి.
– పిల్లలను మరీ అనుమానించడం మంచిది కాదు.
– లోటుపాట్లు గమనించి వాటి నుంచి బయటపడేందుకు చాలా సహనం వహించాలి.
– పెద్దల సమయానికి, వారి సమయానికి పోలిక వద్దు.
– తల్లిదండ్రులే వారికి సమయాన్ని కేటాయించాలి. అప్పుడు తల్లిదండ్రులు దగ్గరుండి చదివిస్తున్నారన్న ధైర్యం వారికి ఏర్పడుతుంది.
– స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. వారికి అనుమానాలు అడిగే వీలు కూడా కల్పించాలి.
– పిల్లల లోటుపాట్లు, ఆసక్తులు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
– ఆందోళనలు, భయాల నుంచి రక్షణ కల్పించే మార్గం గురించి ఆలోచించాలి.
– వారికి మనోధైర్యం కల్పించాలి.
– ఆత్మవిశ్వాసం నింపాలి. అపుడే చదువులో బాగా రాణిస్తారు.
– మార్కులు తక్కువ వచ్చాయని తిట్టడంకంటే, బాగా చదవాలని ఉత్సాహపరచాలి.
– పాజిటివ్‌ థింకింగ్‌ చాలా అవసరం. పిల్లలు తల్లిదండ్రుల నుంచి అదే ఆశిస్తారు.
– వారి నుంచి లక్ష్యాలను ఆశిస్తున్నప్పుడు, మీరూ వారితో అంతే స్నేహంగా, రక్షణగానూ వ్యవహరించాలి కదా! ఏమంటారు?
డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

Spread the love