మత్తుమందు ఇవ్వకుండానే చిన్నారులకు డాక్టర్ల ఆపరేషన్​

నవతెలంగాణ – హైదరాబాద్: ఇజ్రాయెల్​, హమాస్​ మధ్య భీకర యుద్ధం మొదలై నెలరోజులు గడిచినా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్ , ఔషధాలు అందక గాజావాసులు అల్లాడుతున్నారు. ప్రాథమిక వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్ల మత్తుమందు ఇవ్వకుండానే చిన్నారులకు వైద్య చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. మరోవైపు, గాజాను ఇజ్రాయెల్‌ తిరిగి ఆక్రమించడాన్ని అంగీకరించబోమని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. గాజా రాజకీయ పునర్నిర్మాణం చర్చల ద్వారానే జరగాలని తేల్చిచెప్పింది.
ఇజ్రాయెల్​ ఆక్రమణను అంగీకరించం’
మరోవైపు, గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించుకునేందుకు అంగీకరించేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. అలాంటి చర్యలకు జో బైడెన్‌ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పష్టం చేశారు. యుద్ధం ముగిశాక.. తామే గాజాలో భద్రతా బాధ్యతను చేపట్టే అవకాశాలున్నాయని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన క్రమంలో అగ్రరాజ్యం తన వైఖరిని స్పష్టం చేసింది. యుద్ధానంతరం.. గాజా ఎలా ఉండాలని చర్చలతోనే నిర్ణయించాలని జాన్‌ కిర్బీ పేర్కొన్నారు. మళ్లీ హమాస్‌ దాడులు, యుద్ధాలు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. పాలస్తీనా భూభాగమైన గాజాను ఆక్రమించడం తప్పు అని ఇదివరకే ఇజ్రాయెల్‌కు బైడెన్‌ తెలిపినట్లు గుర్తుచేశారు.

Spread the love