– వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు
నవతెలంగాణ -భిక్కనూర్
సాయుధ పోరాట రైతంగ యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి భిక్నూర్ మండలం జంగంపల్లి గ్రామంలో భూ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిజాం రజాకార్లకు దేశముకులకు వ్యతిరేకంగా భూమి కోసం పోరాటం చేశాడని, ఆయన అమృతం తోటి సాయుధ పోరాటం ఉవ్వెత్తునైగేసే పడిందన్నారు. ఆ పోరాటం చేసి లక్షల ఎకరాలు భూమిని పేద ప్రజలకు కమ్యూనిస్టులు పంచారని, ఆయన ఆశయ సాధన కోసం కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ప్రవీణ్, పోచయ్య, నర్సింలు, చంద్రకళ, నరసవ్వ, రమణ, శ్యామల, తదితరులు పాల్గొన్నారు.