దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ -తాడ్వాయి
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు శివరాం, సిద్ది రాములు, మోహన్ రాజ్ పాల్గొన్నారు.
Spread the love