నవతెలంగాణ -వీణవంక
మండలంలోని ఎల్బాక గ్రామంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గొర్లు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బస్టాండ్ లో మంగళవారం దొడ్డి కొమురయ్య చిత్ర పటం ఏర్పాటు చేసి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొర్లు, మేకల పెంపకం దారుల జిల్లా సహాయ కార్యదర్శి పిల్లి రవియాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కొమురయ్య పోరాటం మరువలేదనిదని అన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ పోరాటం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెడ్ల విజేందర్, రొడ్ల రాజుకుమార్, కొత్తిరెడ్డి మల్లారెడ్డి, ముదం కొమురయ్య, మడికొండ సంపత్, పోలు భూమయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.