చుక్కల దుప్పిపై కుక్కల దాడి

చుక్కల దుప్పిపై కుక్కల దాడినవతెలంగాణ-సిర్పూర్‌(టి)
సిర్పూర్‌ గ్రామ శివారు ప్రాంతంలో చుక్కల దుప్పి రావడంతో కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. సమాచారం తెలసుకున్న సిర్పూర్‌ క్షేత్రాధికారి ఇక్బాల్‌ హుస్సేన్‌ సిబ్బందితో అక్కడి వెళ్లారు. దాన్ని చికిత్సలు అందించారు. క్షేత్రాధికారి వివరాల ప్రకారం చుక్కల దుప్పి సమీప రైల్వే ట్రాక్‌ దాటి గ్రామ శివారు ప్రాంతంలోకి వచ్చింది. అక్కడున్న కుక్కలు దుప్పి కాళ్లు, తొడపై దాడి చేశాయి. చికిత్స నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలివేయడానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే చనిపోయిందని ఇక్బాల్‌ హుస్సేన్‌ తెలిపారు. చనిపోయిన చుక్కల దుప్పిని అటవీ క్షేత్ర కార్యాలయం ఆవరణలో ఖననం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఆర్‌ఓలు శ్రీధర్‌ చారి, ప్రవీణ్‌ కుమార్‌, ఎఫ్‌బీఓ హభిబ్‌, సిబ్బంది ఉన్నారు.

Spread the love