కాజీపేటలో చిన్నారులపై కుక్కల దాడి..

నవతెలంగాణ – వరంగల్:  వీధికుక్కలు దాడి రోజు రోజుకు పెరుగుతుంది.  ఉదయం బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు ఎగబడ్డాయి. చిన్నారిని విచక్షణారహితంగా కొరికి మెఖంపై కట్లటువేశాయి. అక్కడే వున్న మరో బాలుడిపై కూడా దాడికి చేసాయి. అయితే ఇద్దరు చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమేందుకు ప్రయత్నించినా ఇద్దరు చిన్నారిపై దాడి చేస్తునే ఉన్నాయి. చిన్నారులను పీక్కుంటూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే స్థానికులు ఆ కుక్కలపై దాడి చేయడంతో పిల్లలను వదిలేశాయి. తీవ్ర గాయాలైన ఇద్దరు చిన్నారులను స్థానికులు హుటా హుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే స్థానికులు ఈ ఘటన తరువాత ఆగ్రహంతో రగిలిపోయారు. చిన్నారులపై దాడిచేసిన కుక్కను వెతికి పట్టుకుని చంపేశారు. మరొక చిన్నారిపై దాడి చేయకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశామని అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఘటన అనంతరం వరంగల్ మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడతామని చెప్పినా ఆచరణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో అమాయక ప్రజలు వీధికుక్కల బారిన పడుతున్నారని మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులపై, ప్రజాప్రతినిధులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై వీధికుక్కలు దాడి చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని.. వేసవిలో చాలామంది బయటనే పడుకుంటున్నామని దీంతో కుక్కటు చిన్నారులు, పెద్దలపై దాడి చేస్తున్నాయని వాపోతున్నారు.

 

Spread the love