అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ సర్టిఫైడ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ

Dolby Certified Post Production Facility at Annapurna Studios– హీరో నాగార్జున సమక్షంలో ప్రారంభించిన దర్శకుడు ఎస్‌ఎస్‌. రాజమౌళి
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐకానిక్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా అండ్‌ హౌమ్‌ కోసం భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ ఏర్పాటు చరిత్ర సష్టించింది. దీనిని దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, అన్నపూర్ణ స్టూడియోస్‌ వైస్‌ చైర్మెన్‌, అగ్రహీరో నాగార్జున అక్కినేని సమక్షంలో ప్రారంభించారు. డాల్బీతో కలిసి ప్రారంభించబడిన ఈ అత్యాధునిక సౌకర్యం, భారతీయ చలనచిత్ర నిర్మాణం ఆడియో-విజువల్‌ ప్రమాణాలను రీడిఫైన్‌ చేయడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సినిమా ఎక్స్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్రాండ్‌ ఈవెంట్‌లో అకాడమీ అవార్డు గెలుచుకున్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌- స్పెషల్‌ ఫుటేజ్‌ను కూడా ప్రదర్శించారు.
అనంతరం దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ ”ఆర్‌ఆర్‌ఆర్‌ సమయంలో, మేము సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్‌ చేయాలనుకున్నప్పుడు, మేము జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. మన దేశంలోనే డాల్బీ విజన్‌లో నా సినిమాను చూపించకపోవడం కొంచెం నిరుత్సాహపరిచింది. కానీ ఈరోజు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్‌ గ్రేడింగ్‌ సౌకర్యాన్ని చూసి నేను చాలా థ్రిల్‌ అయ్యా. నా తదుపరి సినిమా విడుదలయ్యే సమయానికి, భారతదేశం అంతటా మల్టీ డాల్బీ సినిమా ఉంటుంది అనేది మరింత గొప్ప విషయం. డాల్బీ విజన్‌లో సినిమా చూడటం పూర్తిగా భిన్నమైన అనుభవం – స్పష్టత, ప్రతి ఫ్రేమ్‌లోని సూక్ష్మ నైపుణ్యాలను పెంచే విధానం కథను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ప్రేక్షకులు దానిని ఎక్స్‌ పీరియన్స్‌ చేయడం థ్రిల్లింగ్‌గా వుంది’ అని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ వైస్‌ చైర్మెన్‌, అగ్రహీరో నాగార్జున అక్కినేని, భారతీయ సినిమా ఆవిష్కరణలలో స్టూడియో ఎలా ముందంజలో ఉందో చెప్పారు. ”వర్చువల్‌ ప్రొడక్షన్‌లో అగ్రగామిగా ఉండటం నుంచి దేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్‌ పోస్ట్‌ప్రొడక్షన్‌ ఫెసిలిటీ ఫర్‌ సినిమా అండ్‌ హౌమ్‌ను ఏర్పాటు చేయడం వరకు, భారతీయ సినిమాలను మ్యాప్‌లో ఉంచడమే మా ప్రయత్నం.
అన్నపూర్ణ స్టూడియోస్‌ 50వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, డాల్బీతో ఈ సహకారం గొప్ప దార్శనికతకు నిదర్శనం. అన్నపూర్ణలో చేంజ్‌ ఇన్నోవేషన్‌ స్వీకరించడం మా లెగసీ, ఇది ఆ ప్రయాణంలో మరో ముందడుగు” అని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈడీ సుప్రియా యార్లగడ్డ ఈ మైలురాయి ప్రాముఖ్యతను వివరించారు. ”సినిమా అండ్‌ హౌమ్‌ కోసం డాల్బీ సర్టిఫైడ్‌ పోస్ట్‌ప్రొడక్షన్‌ ఫెసిలిటీతో, భారతదేశంలో సినిమాల క్రియేషన్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పునర్నిర్వచించే గేమ్‌-ఛేంజింగ్‌ టెక్నాలజీని మేము పరిచయం చేస్తున్నాం. ఫిల్మ్‌మేకర్స్‌ తమ కథలను అద్భుతమైన ప్రభావంతో చెప్పడానికి మేము సాధికారత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాల్బీ విజన్‌, డాల్బీ అట్మాస్‌లో స్పెషల్‌ కంటెంట్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సీన్స్‌ ప్రదర్శించారు. ఇవి ఫెసిలిటీ ఫీచర్స్‌ని హైలైట్‌ చేశాయి.

Spread the love