దాతల సహకారం అభినందనీయం దోమ ఎంఈఓ హరిశ్చందర్‌

నవతెలంగాణ-దోమ
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అభినందనీయమనీ దోమ ఎంఈఓ హరిశ్చందర్‌ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మెట్టుగడ్డ తం డా ప్రాథమిక పాఠశాలలో ఇటీవల తండా సర్పంచ్‌ పాఠ శాలను అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యం కొరకు ఆటో సౌకర్యం కల్పించారు. దీంతో పాటు తండా యువకులు చందర్‌ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన గ్రామం సర్పంచ్‌, గ్రామపెద్దలను ఎంఈఓ హరిశ్చందర్‌ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భం గా పాఠశాల అభివృద్ధికి అన్నివిధాలా ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు యువకులు కృషి చేయడాన్ని అభినందిం చారు. కార్యక్రమంలో కిష్టాపూర్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యా యులు మహేంద్ర బహదూర్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ రవి పాఠశాల, చైర్మన్‌ చాందిభాయి, కిష్టాపూ ర్‌ సీఆర్పీ రేడ్యా నాయక్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు రాకేష్‌, గ్రామ పెద్దలు చందర్‌, దేవేందర్‌, రమేష్‌, గణేష్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love