నవతెలంగాణ – హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో తొమ్మిది రోజుల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడినట్టయింది. ఈ తరుణంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 520 పాయింట్లు నష్టపోయి 59,910కి పడిపోయింది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 17,706కి దిగజారింది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 9.40 శాతం పతనమయింది.