రక్త దానం చేసి ప్రాణాలు కాపాడండి : పొత్కపల్లి ఎస్సై శ్రీధర్

నవతెలంగాణ-ఓదెల: రామగుండం కమిషనర్ రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరం పెద్దపల్లి ఐటిఐ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినట్లు పొత్కపల్లి ఎస్సై శ్రీధర్ విలేకరుల సమావేశంలో తెలిపారు.అక్టోబర్ 2 సోమవారం రోజున గాంధీ జయంతి ని పురస్కరించుకొని పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరానికి యువత తరలిరావాలని కోరారు.ఓదెల మండలం నుండి రక్తదాన శిబిరానికి సుమారు 700 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. రక్తదానం చేయడం ఒక ప్రాణాన్ని కాపాడడంతో సమానమని ఓదెల మండలం నుంచి రక్తదానం శిబిరానికి రిజిస్టర్ చేయించుకున్న ప్రతి ఒక్కరు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

Spread the love