
– విరాళం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న విశ్రాంతి ఉద్యోగులు
నవతెలంగాణ – నూతనకల్
మండల విశ్రాంత ఉద్యోగులు నూతనంగా నిర్మాణం చేపట్టే భవనానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన రెండున్నర లక్షల ఆర్థిక సహాయాన్ని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ తీగల గిరిధర్ రెడ్డి సోమవారం మండల కేంద్రంలో విశ్రాంత ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు భవన నిర్మాణం మధ్యలో ఆగిపోగా ఎంపీగా ఉన్న సమయంలో విశ్రాంత ఉద్యోగ సంఘ నాయకులు కలిసి ఆర్థిక సహాయాన్ని కోరగా స్పందించన మంత్రి విరాళం అందజేశారని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రజల అనారోగ్య సమస్యలను గుర్తించి వారికి భారీగా సహాయం చేస్తున్నారని తెలిపారు ఇటీవల తిరుమలగిరి మండల పరిధిలోని గుండెపురి లో అనారోగ్యం మృతి చెందిన వెంకన్న కుటుంబానికి లక్ష రూపాయలు మద్దిరాల మండల పరిధిలోని రెడ్డిగూడెం లో ఇల్లు దగ్ధమై మృతి చెందిన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందజేసి మంత్రి తన దాతృతీని చాటారని తెలిపారు. మంత్రి ఆర్థిక సహాయం పట్ల హర్షం,, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విశ్రాంతి ఉద్యోగులు నూతనంగా చేపట్టే భవన నిర్మాణం అడిగిన వెంటనే రెండున్నర లక్షలు ఆర్థిక సహాయం పట్ల విశ్రాంతి ఉద్యోగుల మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేసారు.