అంధుల జీవన భృతి కోసం విద్యార్థుల విరాళం

నవతెలంగాణ – సిద్దిపేట
పట్టణానికి చెందిన సహస్రవిద్యాలయం  విద్యార్థులు సోచ్ ఫౌండేషన్ లోని అంధుల జీవనభృతి కొరకు రూ 29,500 విరాళంగా పాఠశాల ఛైర్మెన్ దరిపల్లి చంద్రం చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చేసిన సహాయం వారి మంచిమనసుకు నిదర్శనం అని అన్నారు.  పార్థించే పెదవుల కన్న సహాయం చేసే చేతులే మిన్న అన్ని అని అన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులను పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ శ్రావణ్ , ప్రిన్సిపల్ శాంతి కిరణ్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు,  పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love