రెడీ టూ సర్వ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదానం

నవ తెలంగాణ -చైతన్యపురి
పేదలకు చేయూతనిచ్చేందుకు రెడీ టూ సర్వ్‌ ఫౌండేషన్‌ ఎల్లప్పు డూ ముందుంటుందని ఆ సంస్థ చైర్మన్‌ పెద్ది శంకర్‌ గౌడ్‌ అన్నారు. నిలోఫర్‌ ఆసుపత్రి వద్ద ఆదివారం రోగులకు, రోగుల బంధువులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడీ టూ సర్వ్‌ ఫౌండ ేషన్‌ ద్వారా పదేళ్లుగా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉన్న రోగు లకు, వారి బంధువులకు నిత్యాన్నదానం చేయాలని సంకల్పి ంచినట్లు తెలిపారు. దాదాపు 500 మందికి అన్నదానం చేసినట్లు తెలి పారు. డాక్టర్‌ మధురెడ్డి ఆర్థోపెటి క్స్‌ మాట్లాడుతూ నిలోఫర్‌ ఆసు పత్రికి వచ్చే వారికి ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఫుడ్‌ పంచడం చాలా సంతోషంగా ఉందన్నారు. డా. రాజేష్‌, సినీ హీరో విజయ భాస్కర్‌, జూనియర్‌ పవన్‌ కళ్యాణ్‌, సీఈఓ ఆఫ్‌ ట్యూషన్‌ ఫుసీన్‌ భాగ్యరాజ్‌, ప్రకాష్‌, శివ నేత, నితిన్‌ ప్రవీణ్‌ గుప్త, బీటీ నాయుడు, మోహంతు, నితిన్‌, లక్ష్మణ్‌ పీిఆర్వో నరేంద్ర, మహేష్‌ పాల్గొన్నారు.

Spread the love