నవతెలంగాణ – ఆర్మూర్
బాల్కొండ లో 521 సంవత్సరకాలంగా కొలువై ఉన్న అతి పురాతన మైన శ్రీ నిమిషంభ దేవి భక్తులైన అమ్మవారికి అమ్మ మీద భక్తితో జగిత్యాలకు చెందిన శ్రీ నాంపెల్లి అశోక్ కీ,,శే,,జమున వారి కుమారుడు నాంపెల్లి ప్రసన్నకుమార్,కోడలు, నాంపెల్లి శ్రీనిజ,మనువడు వృషాoక్ సాయి,శమనక మహాముని గోత్రం,పావు కిలో వెండి (రూ,,18,250/-) తో పాటు శ్రీ నిమిషంభ దేవి కళ్యాణ మండప నిర్మాణం కోసం రూ,,11,116/- బుదవారం రోజు నాంపల్లి అశోక్ శ్రీనిమిషంభ ఆలయానికి వచ్చి విరాళంగా ఇచ్చారు.ఇది ఇలా ఉండగా గతంలో నిజామాబాద్ జిల్లా బాల్కొండ గ్రామానికి చెందిన శ్రీ నిమిషంభ సేవకులైన బి.అర్. నర్సింగ్ రావు ద్వితీయ కుమారుడు బి. లింబెష్ కోడలు పావని సుధ శ్రీ నిమిషంభ దేవికి వెండితో 11 తులాల 3 గ్రములతో రూ,,10,400/- విలువ గలది మెడలో “కమలం పూల హారాన్ని అమ్మ వారి జన్మ దినం రోజున 30-04-2023 అంద జేశారు.పై కుటుంబాల వారికి శ్రీ నిమిషంభ దేవి కరుణా కటాక్షాలు ఉందాలని ఆలయ సేవకు లైన బి.గంగాధర్,చౌదరీ, బి.అర్. నర్సింగ్ రావు శ్రీ నిమి శంభ దేవిని వేడుకున్నారు. ఈ రోజు జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో ఆలయ పూజారి బి.కృష్ణ రావు జోషి, జగిత్యాలకు చెందిన నాంపల్లి అశోక్ వర్మ, బి.గంగాధర్, చౌదరీ, బి.చిన్న గంగాధర్, బి.సునీత, బి.సత్య నారాయణ, బి.అర్. నర్సింగ్ రావు, బి.మనేమ్మ తదితరులు పాల్గొన్నారు.