దాతల సహకారం అభినందనీయం: ఎంఈఓ

Donors' contribution appreciated: MEOనవతెలంగాణ – పెద్దవంగర
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. పోచారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాత బానోత్ సురేందర్ నాయక్ తన సొంత ఖర్చులతో శనివారం టీషర్టులు అందజేశారు. అనంతరం చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్, గ్రామ ప్రత్యేకాధికారి శేషావల్లి తో కలిసి ఎంఈవో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నేడు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. మన ఊరు -మన పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పాఠశాల విద్యార్థులకు టీషర్టులు అందించిన దాత సురేందర్ నాయక్ కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, గ్రామపంచాయతీ కార్యదర్శి మణి కుమార్, ఉపాధ్యాయుడు మురళి, ఏఏపీసీ బానోత్ సునితా సీతారాం నాయక్, అంగన్వాడీ టీచర్ ఝాన్సీ, సీఆర్పీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love