– ప్రభుత్వ పథకాలు అందాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలి
– వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
ఎన్నికల సమయంలో వచ్చి మాయ మాటలు చె ప్పే నాయకులను ప్రజలు నమ్మకుండా పనిచేసేవా రి ని గుర్తించి ఓటు వేయాలని వికారాబాద్ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మండలంలోని కొంషేట్ పల్లి, మొగిలి గుండ్ల, పట్లూర్, ఘనపూర్ గ్రామాల్లో జరిగిన ఎన్ని కల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మా ట్లాడుతూ ఎన్నికలవేళ ఆయా పార్టీల రాజకీయ నా యకులు ప్రజల ముందుకు వచ్చి మాయ మాటలు చె ప్పి ఓట్లు దండుకొని వెళతారే తప్ప పనులు చేయరని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలోని పల్లెల్లో అభివద్ధి ప్రారంభమై ప్రజల సం క్షేమం మొదలైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభు త్వ పథకం అందని ఇల్లు లేదన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల గ్రామాల అభివద్ధిని మరిచి వారి సొంత సం పాదనకు పాటుపడ్డారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివద్ధే లక్ష్యంగా పథకాల ను అందిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మకూడదన్నారు. కారు గుర్తుకు ఓటు వే సి మరోసారి కెేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కో రారు. ఆయా గ్రామాల్లో అంబేద్కర్, ఛత్రపతి శివాజీ, బసవేశ్వర, తెలుగు తల్లి విగ్రహాలకు ఆయన పూల మాలలు వేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఇందిరా అశోక్, కల్పనా శంకర్, జడ్పీిటీసీ మధుకర్, వైస్ ఎం పీపీ మోహన్ రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు నాయబ్ గౌడ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీిల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, డైరెక్టర్లు యాదయ్య, గౌస్, పట్టణాధ్యక్షుడు గఫార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షఫీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య గౌడ్, నాయకులు గో పాల్ రెడ్డి, బట్టు రమేష్, యాదవ రెడ్డి, అశోక్, మో హన్, రాచన్న, వికాస్ కుమార్, తదితరులున్నారు.