వాటిని నమ్మకండి

‘షూటింగ్‌ దశలో ఉన్న కొన్ని సినిమాల నుంచి నన్ను తీసేశారని లేదా నేనే తప్పుకున్నానే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా నా ఫ్యాన్స్‌తో పాటు పలువురు వీటి గురించే అడుగు తున్నారు. అవన్నీ అవాస్తవం. వాటిని నమ్మకండి’ అని నాయిక రష్మి మందన్న మీడియాకి క్లారిటీ ఇచ్చింది. ‘భీష్మ’ తర్వాత నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల కాంబోలో మరో సినిమా ఇటీవల ఓకే అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌తోపాటు ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లో రష్మిక నటించడం లేదని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక దీని గురించి స్పందిస్తూ, ‘నన్ను ఏ ప్రాజెక్ట్‌ నుంచి తీసెయ్యలేదు. అలాగే నేను ఏ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోలేదు. ప్రస్తుతం రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’, అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’, ధనుష్‌తో డి51తో పాటు ‘రెయిన్‌బో’లో నటిస్తున్నా. ఇవన్నీ మల్టీ లాంగ్వేజ్‌ సినిమాలే. వీటిల్లోని పాత్రలన్ని మిమ్మల్ని అలరిస్తాయి’ అని తెలిపింది.

Spread the love