ఆల్ ఫోర్స్ కార్పొరేట్ కళాశాల బస్సులు నడపొద్దు…ఎస్ఎఫ్ఐ

నవ తెలంగాణ-భువనగిరి రూరల్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోఉన్న ఔషపూర్ గ్రామంలో ఆల్ఫోర్స్ కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు చేసి కళాశాల నడపడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి చింతల శివ అన్నారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సింగన్నగూడెంలో వారు మాట్లాడుతూ ఈ కళాశాలకు సంబంధించి బస్సులు ఔషపూర్ నుండి భువనగిరి వరకు అడ్మిషన్ల కోసం నడపడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే భువనగిరి హైదరాబాద్ దగ్గరగా ఉన్నందున అనేక మైనటువంటి కార్పొరేట్ కళాశాలలకు అనేకమంది విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు హాస్టల్ కు చదువుల రీత్యా వెళ్తున్నారని అన్నారు. ఈ ఆల్ ఫోర్స్ కార్పొరేట్ కళాశాల బస్సులు భువనగిరికి నడపడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలు అదేవిధంగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మూతపడే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మూతపడే విధంగా ఉన్న, ఈ కార్పొరేట్ కళాశాల వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. నిరుద్యోగులు ఉన్నటువంటి లెక్చరర్స్ ఈ కళాశాలలో పనిచేస్తున్నటువంటి వారు ఈ బస్సులు పెట్టి అడ్మిషన్లు తీసుకుంటే భువనగిరి లో ఉన్న లెక్చరర్స్ వారి యొక్క ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. కళాశాల మూతపడే విధంగా, లెక్చరర్స్ యొక్క ఉపాధిని కోల్పోయే విధంగా ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల బస్సులను పెట్టి నడుపుతామంటే బస్సులను అడ్డుకుంటామని వారు అన్నారు. కళాశాల రెసిడెన్షియల్ గా నడుపుకొని ఎవ్వరికి ఇబ్బంది లేకుండా కళాశాల నడుపుకోవాలని వారన్నారు.ఇప్పటికైనా బస్సులు నడపకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని వారిని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నెలిగొండ వినయ్, నేలిగొండ సాయిచరన్, పిచ్చుక రాజశేఖర్, నెలిగొండ శివనాగెందర్ లు పాల్గొన్నారు.

Spread the love