అటవీ అమర వీరుల త్యాగాలు మరువొద్దు

Don't forget the sacrifices of the immortal heroes of the forest– విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
–  అమరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నవతెలంగాణ – ధూల్‌ పేట్‌
అటవీ అమరవీరుల త్యాగాలను మరువొద్దని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరా బాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు స్మారక చిహ్నం వద్ద అధికారులు, సిబ్బందితో కలిసి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విధి నిర్వ హణలో 1984 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది తమ ప్రాణాంకోల్పోవడం చాలా బాధాకర మన్నారు. విధి నిర్వహణలో అశువులు బాసిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.
భద్రాది – కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు గతేడాది నవంబర్‌ 22న గుత్తికోయల చేతిలో ప్రాణం కొల్పోయారని, అడవుల సంరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిదని అన్నారు.ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడిందని, సీఎం కేసీ ఆర్‌ మానవతా దృక్పథంతో శ్రీనివాసరావు సతీమణి నాలగక్ష్మికి డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం కల్పిం చారని తెలిపారు. అంతేకాకుండా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు ఖమ్మం జిల్లాలో 500 గజాల ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినట్టు చెప్పారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి వివరిం చారు. 2022- 2023లో అటవీ రక్షణలో భాగం గా అటవీ అధికారులు 79,735 కేసులను నమోదు చేసి, రూ.43.56 కోట్ల జరిమానా విధించారని తెలి పారు. రూ.7.31 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారని, 15,122 వాహనాలను జప్తు చేశారన్నారు. 12,019 అటవీ భూ ఆక్రమణ కేసులు నమోదు చేశారని వివరించారు. అంతేకా కుండా అటవీ ప్రాంతంలో చెట్లను నరికిన అగంత కులపై 26,408 కేసులు నమోదు చేసి రూ.57.81 కోట్ల విలువ చేసే కలపను స్వాధీనం చేసుకున్నారన్నారు. అటవీ శాఖను బలోపేతం చేయడానికి గతేడాది 1393 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్ల (ఎఫ్‌బీఓస్‌), 14 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు (ఎఫ్‌ఆర్‌ఓస్‌) ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని.. భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
శాఖాహార జంతువుల కోసం 1806.11 హెక్టార్ల విస్తీర్ణంలో సహజ గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేయడం, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు సోలార్‌ పంప్‌ సెట్లు, సాసర్‌ పిట్స్‌ ఏర్పాటు చేశా మన్నారు. భవిష్యత్‌లో అటవీ భూములు అన్య క్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌. ఎం.డోబ్రియాల్‌, వన్యప్రాణుల ముఖ్య సంరక్షణ అధికారి లోకేష్‌ జైస్వాల్‌, వీసీ అండ్‌ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, జూపార్క్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌, క్యురేటర్‌ సునీల్‌ హీరమత్‌, రిటైర్డ్‌ పీసీసీఎఫ్‌ పీకే ఝా, మనోరంజన్‌ భాంజ, మునీంద్రా, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌లు సునీల్‌ కుమార్‌ గుప్తా, బుచ్చి రామిరెడ్డి పాల్గొన్నారు.

Spread the love