అధైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

– మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్
నవతెలంగాణ -మల్హర్ రావు
అధైర్య పడవద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మంథని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ అన్నారు. మంథని పట్టణ బీఆర్ఎస్ నాయకుడు సముద్రాల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో రిచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని పుట్ట తెలుసుకొని శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ను పరమార్షించి,అదైర్య పడవద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love