వాహనాలు పడిపోతున్నాయి పట్టించుకోరా!

– ఎత్తు పళ్లాలుగా 163 వ జాతీయ రహదారి మార్జిన్
నవ తెలంగాణ-గోవిందరావుపేట
వాహనాలు పడిపోతున్నాయి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి అయినా పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని పసర నుండి తాడువాయి వరకు 163 వ జాతీయ రహదారి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ జాతీయ రహదారిపై డిటి లేయర్లు పోయడంతో రహదారి ఎత్తు పెరగడం వల్ల సైడ్ ప్రాంతాల్లో లోతు ప్రాంతముగా మారి వాహనాలు ఎక్కి దిగే సమయంలో ప్రమాదాలకు గురై పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు గాయపడడంతో పాటు వాహనాలు కూడా దెబ్బతిని యాజమాన్యం కోలుకో లేకుండా పోతున్నారు. ఈ రహదారిపై ఇటీవల రఫ్ లేయర్ స్మూత్ లేయర్ ల పేరుతో రెండు వరుసల బిటిని పోయడం వల్ల సుమారు కొన్ని ప్రాంతాల్లో ఫీటు ఫీటున్నర ఎత్తుకు రహదారి అయింది. రాత్రి వేళల్లో ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ ఫోక్స్ లో ద్విచక్ర వాహనాలు కార్లు తదితర వాహనాలు రహదారి దిగి ఎక్కే క్రమంలో తరచు ప్రమాదాలకు లోనవుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం పసర గ్రామంలోని చర్చి ప్రాంతంలో ఒక దాన్యం లారీ కూడా రహదారి దిగి ఎక్కుతున్న గ్రామంలో బ్యాలెన్స్ చెదిరి ఒరిగి పడిపోయింది ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ వేగంగా లేకపోవడం వల్ల స్వల్ప గాయాలతో డ్రైవర్ బయటపడ్డాడని వేగంగా ఉంటే ప్రమాద తీవ్రత మరో విధంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. నెలలు దాటుతున్న ఈ పరిస్థితిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రజలు అంటున్నారు. ద్విచక్ర వాహనదారుల ఇబ్బందులు మరీ తీవ్రంగా ఉన్నాయని రాత్రిపూట మరింత ప్రమాద భరితంగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రహదారికి ఇరువైపులా సైడ్ మొరం తోలించి చదును చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నట్లు తెలుపుతున్నారు. ఆలస్యం జరిగినా కొద్దీ ప్రమాదాల తీవ్రత అంతకంతకు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి అలసత్వం పనికిరాదని అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనులు ప్రారంభించాలని అంటున్నారు. రహదారికి ఇరువైపులా సైడ్ మొరం పోయాలని లేనియెడల ఎక్కడ పడిపోతా మొనన్న భయం డ్రైవర్లను వాహన యజమానులను వెంటాడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆటో మరియు ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కలేనీ పరిస్థితి. గూగులోత్ సమ్మయ్య ఆటో డ్రైవర్ మొద్దులగూడెం. 163వ జాతీయ రహదారిపై పసర నుండి తాడువాయి వరకు ఆటోలు ద్విచక్ర వాహనాలు కార్లు వీటి నుండి కిందకు దిగితే మళ్ళీ వెంటనే ఎక్కి పరిస్థితులు లేవు.వాహనాల కింది భాగం రహదారి దాకిడికి దెబ్బ తింటున్నాయి. పలువురు ప్రమాదాల బారినపడి గాయాలపాలు అవుతున్నారు. వీటిని అత్యవసర పనిగా గుర్తించి వెంటనే రహదారికి ఇరువైపులా సైడ్ మొరం పోసి ప్రమాదాలను నివారించాలి.

Spread the love