– మార్కెటింగ్ మేనేజర్ విద్యాసాగర్
నవ తెలంగాణ హుస్నాబాద్: వరి ధాన్యం కొనుగోల్లలో నిర్లక్ష్యం చేయకుండా ఏప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలని మార్కెటింగ్ సెంటర్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చేలా సూచనలు చేయాలన్నారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, డి ఎం జి ప్రసాద్ ,సిసి అశోక్, వివో ఏ లక్ష్మి, రమ పాల్గొన్నారు.