– నిబంధనలు పాటించని పాఠశాల యజమానిపై చర్యలు తీసుకోవాలి
– పీడీఎస్‌యూ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బుజ్జి శ్రీకాంత్
నవతెలంగాణ-చేవెళ్ల
ఫిట్‌నెస్ లేని పాఠశాల స్కూల్ బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ చేవెళ్ల డివిజన్ ప్రధాన కార్యదర్శి బుజ్జి శ్రీకాంత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని, వారివారి ఇంటి వద్ద వదిలిపెట్టడానికి బయలు దేరింది. పాఠశాల నుంచి చేవెళ్ల మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలోకి రాగానే బస్ బ్రేకింగ్ హెర్ ట్యాంక్ ఊడిపోయి రోడ్డుపై పడింది. అదే హైవే రోడ్డుపై జరిగి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ప్రమాదం జరిగిన నుంచి విద్యార్థులు గంటపాటు బస్సులోనే ఉన్నారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు వచ్చి చిన్నారులను తీసుకెళ్లారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై సుమోటోగా స్వీకరించి పోలీస్‌లు పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఆర్టీఏ అధికారులు నామమాత్రపు తనిఖీలు చేసి పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.