– న్యూ శంషాబాద్ హుడా కాలనీ అధ్యక్షులు వక్కంటి జనార్ధన్
– హుడా కాలనీ శ్మశాన వాటిక పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలి
– గేటుపై ఉన్న మున్సిపల్ కౌన్సిలర్ అమృతరెడ్డి పేరు తొలగించాలి
– ఖననాలపై రిజిస్టర్ నిర్వహించాలని డిమాండ్
నవతెలంగాణ-శంషాబాద్
పోరాడి సాధించుకున్న శ్మశా న వాటికపై ఇతరుల పెత్తనం ఉండకుండా మున్సిపల్ అధికారు లు పూర్తి బాధ్యత తీసుకోవాలని న్యూ శంషాబాద్ హుడా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వక్కంటి జనార్ధన్ డిమాండ్ చేశారు. శంషాబాద్‌లోని హు డా కాలనీ శ్మశానవాటిక గేటుపై ఎయిర్ పోర్టు కాలనీ కౌన్సిలర్ అమృతారెడ్డి పేరు, ఫోన్ నెంబర్ రాసి పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం శంషాబా ద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.. న్యూ శంషాబాద్ హుడాకాలనీ శ్మశాన వాటికపై శంషాబాద్ మున్సిపల్ కౌన్సి ల్ పూర్తి బాధ్యత తీసుకోవాలని, ఇతరుల జోక్యాన్ని అడ్డుకో వాలని అన్నారు. ఈ మేరకు శంషాబాద్ మున్సిపల్ కమిష నర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలి పారు. ఈ కాలనీ శ్మశాన వాటిక కోసం 1997 జూలై నుం చి 2008 జూన్ 13 వరకు వివిధ శాఖల అధికారులకు అప్పటి సీఎం, స్ధానిక సర్పంచ్, జిల్లా కలెక్టర్, ఓఆర్‌ఆర్ ప్రత్యేక అధికారి, శంషాబాద్ తహసీల్దార్, అప్పటి మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, పీడీ స్పెషల్ కలెక్టర్, వీసి హుడా అధికా రులకు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. పోరాటం అనంత రం ఓఆర్‌ఆర్ పీఆర్‌అండ్‌ఆర్ అధికారి హెచ్‌ఎండీఏ తార్నాక 2012లో శంషాబాద్ గ్రామపంచాయతీ ఈవోకు రింగ్ టౌన్ న్యూ శంషాబాద్ శ్మశాన వాటిక మం జూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ శ్మశాన వాటికపై సంబంధం లేని వ్యక్తులు తమ పేరు రాసుకొని వ్యక్తిగత ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తు న్నారని ఆరోపించారు. దీని నిర్వహణ బాధ్యత పూర్తిగా శంషాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఇతరుల పేర్లు రాయ కుండా న్యూ శంషాబాద్ హుడా కాలనీ శ్మశాన వాటిక పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలని కోరా రు. దీంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన శవాలను పూడ్చిపెట్టే క్రమం లో ఎలాంటి భవిష్యత్తు అవాంతరాలు జరగకుండా మున్సి పల్ అధికారులు రిజిస్టర్ నిర్వహిస్తూ సంబం ధించిన విషయాలను సమగ్రంగా రికార్డు చేయాలని కోరారు.
అవకాశాన్ని బట్టి శ్మశాన వాటికకు బోర్డు ఏర్పాటు : మున్సిపల్ కమిషనర్, శంషాబాద్
శ్మశాన వాటికకు మున్సిపల్ కౌన్సిలర్ పేరు రాసుకోవడం పెద్ద విషయం కాదు. అక్కడ ఉండి మంచి, చెడులు చూసుకునేవారు పేరు రాసుకుంటే తప్పేముంది. అయినా శ్మశాన వాటిక గేటుపై ఉన్న కౌన్సిలర్ పేరు, ఫోన్ నెంబర్ తొలగిస్తాం. బోర్డు ఏర్పాటు వెంటనే అయ్యే పని కాదు. అవకాశాన్ని బట్టి హుడా కాలనీ శ్మశాన వాటిక గేటు వద్ద బోర్డు ఏర్పాటు చేస్తాం.