కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్న నాగజ్యోతి బీ ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా మండలంలోని చల్వాయి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని మండల అధ్యక్షులు సురపనేని సాయికుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. శనివారం ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి మాట్లాడుతూ కార్యకర్తలను నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూరైతుల పదివేళ్ళు మట్టిలో పనిచేస్తేనే మనందరికీ అయిదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయి.తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత కరెంటు కొరత కూడా లేకుండా జరిగిందన్నారు.అదేవిధంగా ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, డబుల్ బెడ్ రూం ఇళ్ళు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయన్నారు. ఇన్ని పథకాలను అమలు చేయడం కేసీఆర్ కే సాధ్యం. ఇంకా ఎవరికి చేతకాదు.రాష్ట్రంలో 46 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ. 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ రూ. 2016 ఇస్తున్నారన్నారు.పక్కనే ఉన్న మహారాష్ట్ర లో ఎనబై సంవత్సరాలు దాటితేనే పెన్షన్, అది కూడా వెయ్యి రూపాయలు మాత్రమే. కర్ణాటక లో ఆరు వందలు, గుజరాత్ లో వెయ్యి రూపాయలు మాత్రమే.యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా లక్షా నూటపదహారు రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ మాత్రమే అన్నారు. గర్భవతి అయిన ఆడబిడ్డకు పౌష్టికాహారం అందించడానికి కోడిగుడ్డుతో అంగన్వాడీ కేంద్రాలలో కడుపు నిండా అన్నం పెడుతున్నారు. బలం కోసం న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాము. ప్రసవం తర్వాత తల్లి బిడ్డకు అవసరమైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నాం. కేసీఆర్ గారి సహకారంతో ములుగు జిల్లా అభివృద్ధిలో ముందు ఉంది. రాబోయే ఎన్నికల్లో ములుగు జిల్లాలో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు నన్ను ఆశీర్వదించాలని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోచల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు నాం పూర్ణ చందర్ ఆధ్వర్యంలో సాగంగా ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు, గోవిందరావుపేట ఇంచార్జ్ సమ్మ రావు, ములుగు జిల్లా రైతు కోఆర్డినేటర్ పళ్ళ బుచ్చయ్యఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి తుమ్మల హరిబాబు . గోవిందరావుపేట రైతు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పృధ్విరాజ్ ఊట్ల గోవిందరావుపేట సోషల్ మీడియా కోఆర్డినేటర్, బి సురేందర్ గౌడ్,ఎంపీటీసీ ఏ శ్రీనివాస్ రావు,చల్వాయి సర్పంచ్ ఈసం సమ్మయ్య, భూ రెడ్డి మధు అధికార ప్రతినిధి, చుక్క గట్టయ్య ఉపాధ్యక్షులు, తొలి మలిదశ గోవిందరావుపేట ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు అజ్మీర సురేష్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చందూలాల్,వి నాగరాజు, ఎస్ కృష్ణారావు,ఎస్ దేవేందర్ రావు మండల్ నాయకులు, ఏ హనుమంతురావు ఉప సర్పంచ్,సీనియర్ నాయకులు డి సంజీవ, వి. మోహన్, గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు అక్కినపల్లి రమేష్, పస్రా గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి, రేండ్ల శ్రీనివాస్ మండల్ నాయకులు, సత్తుభద్రయ్య, మహేందర్, బొల్లం ప్రసాద్,బి ఓదెలు, కొండి రమేష్ ఉపాధ్యక్షులు, ఎస్ యాకోబు, జి రఘు, పి భద్రయ్య, ఆర్ మల్లేష్, పి స్వామి, బి లింగయ్య, ఆర్ హనుమంతు, ఐలేని, వెంకన్న, కే రవి, మహిళలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అనుబంధ సంఘాలు వివిధ సంఘాల నాయకులు యూత్ అధ్యక్షులు సోషల్ మీడియా వారియర్స్ బీ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు