మండలంలోని అమీర్ నగర్ లో శుక్రవారం సర్పంచ్ పుప్పాల గంగాధర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నాయకులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, గ్రామంలో మంత్రి చేసిన అభివృద్ధి పనులు ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపంచాలని కోరారు. గ్రామంలో మంత్రి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ నాయకులు ఓటర్లను కోరారు. ముచ్చటగా మూడోసారి మంత్రి ప్రశాంత్ రెడ్డి ని గెలిపించుకోవడం ద్వారా గ్రామంలో మరింత అభివృద్ధి సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాలావతి ప్రకాష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.