బగ్ లింగంపల్లి యంఐజీ, హెచ్ఐజీలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం. దశరథంను గెలిపించాలని ఇంటింటి ప్రచారం. బగ్ లింగంపల్లి యంఐజీ హెచ్ఐజీలో, ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతూ సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు ఎం దశరథ్ ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. బగ్ లింగంపల్లి ప్రాంతంలో ధనికులు ఉన్నత విద్యా వంతులు నివాసం ఉన్నప్పటికీ అనేక సమస్యలు నెలకొన్నాయని, ఈ సమస్యలపై గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు గానీ ప్రజా ప్రతినిధులు గాని ఒక్కరు పనిచేయడం లేదని, ఈ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయలేదని, సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపిస్తే బగ్ లింగంపల్లి లో నెలకొన్న అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని తిరుగుతూ బగ్ లింగంపల్లి వాసులను చైతన్య పరుస్తూ ఎలక్షన్ గుర్తు సుత్తె కోడవలి నక్షత్రం చూపిస్తూ ఓటు వేయమని వారు ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి. రాములు, యం శ్రీనివాస్ రెడ్డి, డి. సైదులు, పీ.లక్ష్మి టి. నిరంజన్ డి. వీరయ్య, నాగరాజు వి. రఘు, బి. విరేష్, భారతి, ఎస్. ఆశోక్,  పీ. ఎల్లమ్మ, రాములు, డీఎల్ మెహన్  తదితరులు పాల్గొన్నారు.
                                              బగ్ లింగంపల్లి యంఐజీ, హెచ్ఐజీలో సీపీఐ(ఎం) అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

Spread the love