ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికీ సర్వే

వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి నాగిల్ల శ్యాంసుందర్‌
నేడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-మంచాల
ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఇంటింటికీ సర్వే చేసి, ప్రజా సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టినట్టు వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి నాగిల్ల శ్యాంసుందర్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని దాత్‌పల్లి, అంబోత్‌తండా, తిప్పాయిగూడ గ్రామాల్లో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఇంటింటికీ సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక ద్వారా ప్రజల వద్దకు వెళ్లి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నట్టు వివరించారు.ఈ నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో రేషన్‌ కార్డుల సమస్య, దరఖాస్తు చేసుకున్న అందని పింఛన్‌, ధరణితో భూ రికార్డుల సమస్యలు,గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్‌ డ్రయినేజీ సమస్యలు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు.ఈ సమస్యల పరిష్కారానికి నేడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యాక్రమం ఉటుందనీ, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల వేధిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర నడుస్తుందని ఈ నెల 27న ఇబ్రహీంపట్నంలో ముగింపు యాత్ర ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సిలివేరు రాజు, వ్యకాస మండలాధ్యక్షులు ఆవుల యాదయ్య, జిల్లా కమిటీ సభ్యులు డబ్బికార్‌ అజరు బాస్‌, పార్టీ గ్రామాల శాఖ కార్యదర్శిలు శ్రీను, అంబోత్‌ రవీందర్‌ నాయక్‌, సీనియర్‌ నాయకులు రమాచారి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సుమంత్‌ తదితరులు ఉన్నారు.

Spread the love