– జూన్ నుంచి గృహలకిë అమలు : ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవ తెలంగాణ – అచ్చంపేట రూరల్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, జూన్ నుంచి గృహలకిë పథకాన్ని అమలు చేస్తామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు రాష్ట్రానికి కరువు వలసలు తప్ప ఏమీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యవంతులను చేస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ ఇచ్చి 102 ద్వారా ఇంటి వద్దకు చేర్చుతున్నారని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసి ఇస్తున్నామని చెప్పారు. జూన్ నెలలో గృహలక్ష్మి పథకం ద్వారా సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకునేందుకు నిధులు లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెలే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ పి.రాములు, జెడ్పీ చైర్మెన్ శాంతకుమారి, జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్, మున్సిపల్ చైర్మెన్ నరసింహ గౌడ్, రైతు సేవ సమితి జిల్లా కన్వీనర్ తోకల మనోహర్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, లబ్దిదారులు పాల్గొన్నారు.