– 7 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్
– షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఇంట్రా కాలేజీ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు ఇంట్రా కాలేజీ విడతలో అభ్యర్థులు వెబ్ఆప్షన్లను నమోదు చేయాలని తెలిపారు. ఐదున సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈనెల ఏడు నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఈనెల 13 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశముందని తెలిపారు. ఏడు నుంచి 14 వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. 17న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేరోజు నుంచి 21 వరకు సీట్లు కేటాయించిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. 18 నుంచి 21 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.