వేసవిలో దోస్త్‌ ‘పుచ్చకాయ’పుచ్చకాయ వలన ఎంతో మేలు

నవతెలంగాణ – హయత్‌ నగర్‌
అందుకే డిమాండ్‌ ఎక్కువ వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడే దోస్త్‌ పుచ్చకాయ.. ఎందుకంటే ఈ ఎండలకు మన శరీర వేడి పెరుగుతుంది.. ఆ వేడి పుచ్చకాయ తింటే తగ్గుతుంది. అంతేకాదు.. చాలా రకాల అనారోగ్య లక్షణాలను కూడా ఇది తగ్గిస్తుంది.. అందుకే వేసవిలో పుచ్చకాయలకు డిమాండ్‌ ఎక్కువ.. పుచ్చకాయ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పుచ్చకాయలు వేసవిలో మాత్రమే లభించేవి. ఎండాకాలంలో వచ్చే అనారోగ్య లక్షణాలను తగ్గించే స్వభావం ఈ పుచ్చ కాయ కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎలా ఉపయోగపడు తుందో ఒక సారి చూద్దాం.. వేసవి తాపం నుంచి కాపాడుకోవడానికి, శరీరాన్ని చల్ల బర్చుకోవడానికి పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయలో పొటాషియం, ఎలోక్ట్రోలైట్‌ లు కూడా అధికంగా లభిస్తాయి. పుచ్చకాయ తినడం వలన బీపీ కంట్రోల్‌ లో ఉంటుంది. గుండె పోటును కూడా నివారిస్తుంది. మధుమేహం ఉన్న వారికి మంచి ఔషధంగాపనిచేస్తుంది. కిడ్నీ వ్యాధులున్న వారు తేనేెతో కలిపి పుచ్చకాయ ముక్కలు తింటే మంచిదని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
వేసవిలో డీ హైడ్రెషన్‌కు గురైన వారు ఈ కాయను తిని తగ్గించుకోవచ్చు. పుచ్చకాయ శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. ఎండ వల్ల వచ్చే టాన్‌, దద్దుర్లు కూడా తగ్గిస్తుంది. ఈ కాయలో ఉండే లైకో పీన్‌ అనే పదార్థం పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి ని పెంచుతుంది.
పుచ్చ గింజల్లోనూ బోలెడు పోషకాలు..
పుచ్చకాయ గింజల్లో విటమిన్‌-బి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల నుండి బయట పడొచ్చు. ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్‌ తగ్గుముఖం పడుతుంది. ఈ గింజలను నీటిలో వేసి మరిగించి ‘టీ’ లాగా తాగడం వలన కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కూడా కరుగుతాయి. అంతేకాదు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపొందించ డానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణకు ఈ గింజలు ఎంతోగానో ఉపయోగపడతాయి.

Spread the love