ఎమ్మెల్యేను సన్మానించిన దోసుపల్లి గ్రామస్తులు..

Dosupalli villagers honour MLA..నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని దోసుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మరియు మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, దోసుపల్లి గ్రామంలో గ్రామానికి నూతనంగా రెండు వరుసల రోడ్డును ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు పనులను వేగవంతం చేయాలని, త్వరగా ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని  సంబంధిత గుత్తేదారునికి ఆదేశించారు. రోడ్డు నాణ్యంగా వేయాలని ఎటువంటి ఔకవకలు లేకుండా ప్రజలకు కొన్నేళ్లపాటు ఉపయోగం లోకి పదికలాలపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని గుత్తేదారునికి అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువ నాయకుడు సతీష్ పటేల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు గ్రామస్తులతో కలిసి ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love