డబుల్‌ ధమాకా..

Double Dhamaka..బాలకష్ణ సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో ఉండే సందడే వేరు. సోమవారం బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు సరికొత్త అప్‌డేట్స్‌ ఇచ్చి, అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. తన 109వ చిత్రాన్ని డైరెక్టర్‌ బాబీ కొల్లితో బాలకృష్ణ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తోంది. బాలకష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ‘జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు’ అంటూ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో బాలకష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాలోనూ బాలకష్ణ పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉండబోతుందని గ్లింప్స్‌ చెప్పకనే చెబుతోంది. ఎస్‌.థమన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, విజరు కార్తీక్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
మరో బ్లాక్‌బస్టర్‌కి సిద్ధం
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ కాంబో ‘సింహా, లెజెండ్‌, అఖండ’ చిత్రాలతో హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్‌లతో సరికొత్త రికార్డులను సృష్టించింది. వీరిద్దరూ నాలుగోసారి జత కడుతున్నారు. ‘లెజెండ్‌’ సినిమా నిర్మాణ భాగస్వాములైన రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఎం. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ డివోషనల్‌ వైబ్‌తో పవర్‌ఫుల్‌గా ఉంది. పోస్టర్‌ తీరు చూస్తుంటే బాలయ్యతో బోయపాటి ఈసారి ఎలాంటి సినిమా తీయబోతున్నాడో తెలుసుకోవాలనే క్యురియాసిటీని కలిగించడం విశేషం.

Spread the love