నవతెలంగాణ-ములుగు
అర్హులకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు పూర్తి చేయాలని, పూర్తయిన 35 ఇండ్లు అర్హులకు ఇవ్వాలని ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు ముంజల గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ముందు పేద ప్రజలతో కలిసి ర్యాలీతోపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్షపతిగౌడ్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం డబుల్ బెడ్ రూమ్‌లు 95 ఇండ్లు ఐదేండ్ల కిందట మంజూరైనట్టు తెలిపారు. నేటికీ ఇండ్ల పను లు పూర్తి చేయలేదని అన్నారు. వెంటనే అర్హుల జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ములుగు పట్టణానికి కొత్తగా 1000 ఇండు మంజూరు చే యాలని కోరారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తూ రెండు నెలల కార్యచరణ ఉద్యమంను ప్రకటిస్తామన్నారు. త్వరలోనే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు బొంపల్లి ఝాన్సీ, గద్దల లక్ష్మి మమ్మద్ మున్ని, ములుగోజు రత్న, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.